ప్ర‌జ‌లంద‌రికీ ఉచిత ప్ర‌యాణం క‌ల్పించే దిశ‌గా జ‌ర్మ‌నీ

trains in germany
trains in germany

బెర్లిన్ః పెరిగిపోతున్న కాలుష్య మహమ్మారికి బ్రేక్ వేసేందుకు జర్మనీ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. ప్రజలందరికీ ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఉచిత ప్రయాణం కల్పించాలన్నది ప్రతిపాదన. దీనివల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గిపోతుందన్నది ఆలోచన. 20 ప్రముఖ పట్టణాల్లో నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి యూరోపియన్ ప్రమాణాలను మించిపోవడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 2020 వరకు ఈ కాలుష్యాన్ని నిరోధించలేదని పరిస్థితి కూడా ఉంది. పట్టణ వాయు నాణ్యత నియంత్రణలో విఫమవుతున్నందుకు జర్మనీపై యూరోపియన్ యూనియన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో, దీనికి నిరోధంగానే జర్మనీ సర్కారు తాజా ప్రతిపాదన చేసింది. ఉచిత రవాణా సౌకర్యం వల్ల అయ్యే వ్యయాలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అవసరమైతే మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని పంచుకుంటాయని అక్కడి ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగిపోయిన పట్టణాల్లో డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన కూడా చేస్తోంది.