ప్రమాణస్వీకారానికి రూ.59లక్షలు వ్యయమా?

kUMARA SWAMY
kUMARA SWAMY

బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరుముఖ్యమంత్రులు, డిప్యూటి సీఎం ప్రమాణ స్వీకారాలకు కేవలం ఆరురోజుల వ్యవధిలోరాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు ఖర్చుచేసింది. ఆర్‌టి కార్యకర్త దరఖాస్తుకు లబఙంచిన ఆధారాలను పరిశీలిస్తే బిజెపికిచెందిన బిఎస్‌యెడ్యూరప్ప రాజ్‌భవన్‌లోగడచిన మే 17వ తేదీ చేసినప్రమాణ స్వీకారానికి రూ.16,16,750లుఖర్చుచేసినట్లుప్రభుత్వం వెల్లడించింది. ఇక అత్యంత అట్టహాసంగా ప్రమాణస్వీకారంచేసినముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కార్యక్రమానికిప్రభుత్వపరంగా రూ.42,89,940లు ఖర్చుచేసారు. అదేనెల 23వ తేదీ కుమారస్వామితోపాటు, కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యఓఉడు జి.పరమేశ్వరసైతం ప్రమాణస్వీకారంచేసారు. అయితే ఆర్‌టిఐ కార్యకర్త టి.నరసింహమూర్తి దాఖలుచేసిన దరఖాస్తుకు కుమారస్వామి కార్యక్రమ వివరాలను ఆర్‌టిఐ అధికారి ఇవ్వలేదు. దస్త్రాలను పరిశీలిస్తే రూ.16.14 లక్షల రూపాయలు కొద్దినిమిషాలపాటు జరిగిన యెడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి ఖర్చయింది. పూల బొకెలకోసమే రూ.21,750 ఖరుచచేసినట్లు చూపించిన అధికారులు హైటీకి సైతం అధికంగా ఖర్చుచేసారు. ఈ ప్రమాణస్వీకారాన్ని కేవలం ఒక సాధారణ సభగానే నిర్వహించామనిచెప్పిన యంత్రాంగం అందుకు రూ.15.93 లక్షలు ఖర్చయిందని వెల్లడించింది. ఇక ముఖ్యమంత్రి, డిప్యూటి సీఎంల ప్రమాణస్వీకారం మేనెల 23వ తేదీ జరిగింద.ఇ రూ.42,89,940లు ఖర్చయింది. అయితే వీటిని ఏఏపద్దుకు ఎంతెంత ఖర్చుచేసిందీ వివరాలు కోరామని ప్రభుత్వనుంచి ఇప్పటికీ రాలేదని ఆర్‌టిఐ కార్యకర్త వివరించారు. ఈనిధులను రాష్ట్రప్రభుత్వం కొంతమంది రైతుల రుణమాఫీకి వినియోగిస్తే సహేతుకంగా ఉండేదని అన్నారు. ప్రమాణస్వీకారాలకు అట్టహాసం ఎందుకని ఆయనప్రశ్నించారు. యెడ్యూరప్ప రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారంచేస్తే కుమారస్వామి విధానసౌధ ఎదురుగా అట్టహాసరంగా ప్రమాణస్వీకారంచేసారు. ఎఐసిసి నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఐదుగురు ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలకు చెందినఅనేకమంది నాయకులు సైతం హాజరయ్యారు.