ప్రధాని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

 

AP CM Chandrababu naidu
AP CM Chandrababu naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. వైఎస్‌ జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థక అప్పగించడం పై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని అన్నారు. ఆయన 5 పేజీల లేఖను మోడికి రాశారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు.