ప్రత్యేక అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు

JAGANAFF

ప్రత్యేక అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు
కాకినాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం సిఎం చంద్రబాబుకు లేదని వైకాపా అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. హోదా డిమాండ్‌తో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఢిల్లీకి వెళ్లిన సిఎం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి వేసారిపోతున్నారని అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేదాకా పోరాటం చేస్తామని జగన్‌పేర్కొన్నారు.