ప్రజావాక్కు

 ఎడిట్‌ పేజీకి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు పంపగోరేవారు www.editpage@vaartha.com  కు మెయిల్‌ పంపగలరు.

ప్రజావాక్కు

PEOPLE VOICE
Voice of The People

కేన్సర్‌ వ్యాధిని జయిద్ధాం: కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, జయశంకర్‌జిల్లా

కేన్సర్‌ వ్యాధి నివారణ నిమిత్తం 2000 సంవత్సరంలో పారిస్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో ఫిబ్రవరి నాలుగోవ తేదీ ప్రపంచ కేన్సర్‌ దినంగా నిర్వహించాలని తీర్మానించారు. 2020 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 మిలియన్లకు చేరగలదని అంచనా. ప్రతీ సంవత్సరం ఈ వ్యాధి తో ఎనిమిది మిలియన్లమంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా జనాభాలో 15 శాతం మంది ఈ వ్యాధితోనే మరణిస్తున్నారు. 2005 సంవత్సరంలో 7.6 మిలియన్ల మంది 2010 సంవత్సరంలో, 9.5మిలియన్ల మంది కేన్సర్‌వ్యాధివల్ల మరణించారని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన నివేదికలో పేర్కొంది. మనదేశంలో ప్రతీ యేటా సుమారు ఏడు లక్షల కేన్సర్‌ కేసులు నమోదు అవ్ఞతు న్నాయి. వీటిలో మూడు లక్షల వరకు నోటి కేన్సర్‌ ఉంటున్నా యి. ఒక్కో కేసుకు సుమారు 3.5 లక్షలు చికిత్సకోసం వెచ్చిం చాల్సి వస్తోంది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆల్క హాల్‌ను సేవించకుండా ఉండడం, మితాహారం, కాలుష్యానికి దూరంగా ఉండడం వలన ఈవ్యాధికి దూరంగా ఉండవచ్చు.

పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డి.ఎ వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ పింఛను విధానంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అది 58 ఏళ్లే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే పదవీ విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచే విషయాన్ని పాలకులు పరిశీలించాలి.

నిర్బంధ కుటుంబ నియంత్రణ: గోపాలుని శ్రీరామమూర్తి, గుంటూరుజిల్లా

గత 60 సంవత్సరాల నుండి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందినా ఈ అధికజనాభా వలన నిర్వీర్యమైపోయింది. 50కోట్ల జనాభాను మాత్రమే భరించగల మనదేశం 130 కోట్లు భరించ లేదు.అందుకే రాజకీయ ఆర్థిక ఆరోగ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయి. కుటుంబ నియంత్రణ చట్టం చేసి అమలు చేయాలి.

పెరుగుతున్న ఇంగ్లీషు భాష ప్రాధాన్యత: వి.వివేక్‌, విశాఖపట్నం

1 నుండి 10వ తరగతులకు ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగుస్తుంది. 1 నుండి 9 తరగతులకు మార్చి ప్రారంభంలోనే ఎస్‌-ఎ2 పరీక్షలు నిర్వహించి, మార్చిలోనే నూతన తరగతుల కు ప్రమోషన్‌ ఇస్తారు. అయితే తరగతులు ప్రారంభం అయ్యే నాటికే నూతన పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి.

ఓటర్‌కు రీకాల్‌ హక్కు: వడపల్లి చంద్రశేఖరరావు, వరంగల్‌

ప్రజాస్వామ్య ప్రజాతంత్ర భారతదేశంలో ప్రజలచెత ఎన్నుకో బడిన ప్రజాప్రతినిదులు స్వార్థచింతనతో అక్రమాలకు, అన్యా యాలకు నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు న్నారు. నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను తమ స్వంత ఆస్తులుగా మలచుకునే ప్రజాప్రతినిధులను ప్రజలు ఏమి చేయ లేని నిస్సహాయ పరిస్థితులున్నాయి. ప్రజలకోసం పనిచేయని ప్రజాప్రతినిధులను ‘ఓటర్‌కు రీకాల్‌ హక్కు (ఎన్నికలలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధిని వెనకకు పిలిచే అధికారం) కల్పించాలి. పౌరుడు కేంద్రంగా పరిపాలన రావాలి. ప్రభుత్వ కార్యాలయం నుండి పౌరసేవలు ప్రతిపౌరునికి అందాలి.

తగ్గుతున్న పాల ఉత్పత్తి: సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలల కాలంలో 20శాతం దాకా పాల ఉత్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. చేస్తున్న వ్యయానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర రాకపోవడంతో పాడి రైతుల ఆసక్తి సన్నగిల్లుతుండడం ప్రస్తుత పరిస్థితికి కారణం అవ్ఞతోంది. పెద్దనోట్ల రద్దుతో రైతులకు రుణ లభ్యత క్లిష్టమైన కారణంగా పశువ్ఞలను విక్రయిస్తున్నారు. పాల ఉత్పత్తి తగ్గిన కారణంగా డిమాండ్‌-సరఫరాల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. పరిస్థితులను ఆసరాగా చేసుకొని పారిశ్రామిక కంపెనీలు రేట్లను పెంచేసాయి. వచ్చే రెండు నెలల్లో రేట్లు మరొక్కసారి పెరగవచ్చు నన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ్ద

స్వచ్ఛ సర్వేక్షణ్‌: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

దేశంలో రోజువారి చెత్త ఉత్పత్తి ద్వారానేల,నీరు,గాలి కలుషిత మై పోయాయి.పర్యావరణ కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగి స్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం ప్రారంభించడం ముదవహం. దేశంలో ఉన్న చెత్తనంతా ఒక దగ్గర కుప్పగా పోయాలంటే జనావాసాలన్ని డంపింగ్‌ యార్డులు గా మారిపోకతప్పదు. అందుకే ప్రభుత్వం ఈ పథకం ద్వారా రీసైక్లింగ్‌ విధానాన్ని చేపట్టి వస్తు తయారీ చేయడం, విద్యుత్‌ ఉత్పత్తికి చెత్తను ఉపయోగించడం, కాగితం తయారీకి వ్యర్థాలను వాడడం, ఎరువుల తయారీకి కంపోస్ట్‌సిట్‌ల నిర్మాణం వంటి చర్యల ద్వారా చెత్త నిర్వహణ సులభతరం అవ్ఞతుంది.

కేంద్రాన్ని విమర్శించడం సబబుకాదు: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా నల్లకుబేరులపై పాశుపతాస్త్రం సంధించారు ప్రధాన మంత్రి. పేద,గొప్ప ప్రాంతీయ బేధాలు లేకుండా యావత్‌ భారతీయులు ఈ చర్యలను సమర్థించడం దేశంలో అవినీతిపరులు, అక్రమా ర్కుల పట్ల ప్రజలలో ఎంతటి వ్యతిరేకత వ్ఞందో ఇట్టే అర్థమవ్ఞ తోంది. అయితే విపక్షాలు మాత్రం ఈ చర్యలలో అంతరార్థం గ్రహించకుండా కేవలం రాజకీయ లబ్ధికోసం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం వారి ద్వందప్రమాణాలకు నిదర్శనం.