‘ప్రగతి నివేదన’ సభకు భారీ జన సమీకరణ

TRS Plenary
TRS Plenary

‘ప్రగతి నివేదన’ సభకు భారీ జన సమీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 25 ప్రభాతవార్త: రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్‌లో సెప్టెంబర్‌ 2న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగే ీప్రగతి నివేదన సభ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోన్నారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 25 లక్షల మందిని ఈసభకు హాజరయ్యేలా చూడాలని టిఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు, నాయకులకు టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మార్గనిర్దేశనం చేసిన నేపథ్యంలో ఆదిశగా వారందరు రంగంలోకి దిగారు.

శుక్రవారం రాత్రినే అన్ని జిల్లాల మంత్రులు వారి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాల వారిగా కనీసం ఒక్కొ నియోజకవర్గం నుంచి 25 వేల నుంచి 30 వేల వరకు కార్యకర్తలు, ప్రజలన తరలించాలని నిర్ణయించారు. ప్రధానంగా రాజధానికిగా సమీపంలోని రంగారెడ్డి జిల్లా నుంచి 8 లక్షలు, మెదక్‌ నుంచి 3 లక్షలు, హైదరాబాద్‌ నుంచి 3లక్షలు ఇలాజిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని క్షేత్రస్థాయికి వెళ్లిపో యారు. 1600 ఎకరాల సువిశాల సభ స్థలిని ఈసభ కోసం కేటాయించారు. ఈ సభా సాయంత్రం 4 గంటలకు ప్రారంభం ప్రారంభం కావాల్సిన..6 గంటల వరకే మొదలవుతుందని..రాత్రి 9గంటల వరకు జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోప్రాంగణమంతా మిరమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులతో పండు వెన్నెలలా మెరిసిపోయేలా ముస్తాబు చేయనున్నారు. ఈదశలో ఈ సభను ‘నభుతో నభవిష్యత్‌ అన్న రీతిలో విజయవంతం చేసేందుకు 8 కమిటీలను శనివారం సిఎం కేసిఆర్‌ నియమించారు.

అందులో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి మహ మూద్‌ అలీ, హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు, రవాణా శాఖ మంత్రి డా.పి. మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సమన్వయకర్తలుగా ఆయన నియమించారు. ఇంకా సభా ప్రాంగణం, పార్కింగ్‌ కమిటీ, వాలంటీర్స్‌ కమిటీ, సభా ప్రాంగణ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు మంచిరెడ్డి తీగల కృష్ణారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టిఎస్‌ఐఐసి ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, నాయకుడు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు నియమించారు. వాలంటీర్స్‌ కమిటీలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టిఆర్‌ఎస్‌కెవి అధ్యక్షులు రాంబాబు యాదవ్‌, టిఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, చిరుమల్లు రాకేశ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయోద్దీన్‌, నాయకులు పల్లా ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌. ధర్మేందర్‌, బి. దినేష్‌చౌదరి ఉన్నారు. నగర అలంకార కమిటీలో === విపత్తు శాఖలో 391 పోస్టులు హైదరాబాద్‌, ఆగస్టు 25, ప్రభాతవార్త: రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక దళంలో ఖాళీ గా ఉన్న 391పోస్టుల భర్తీకి ప్రభుత్వం అను మతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ శనివారం వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇందులో భాగంగా 33 స్టేషన్‌ ఫైర్‌ అధి కారులు, 284 ఫైర్‌మెన్‌లు, 18 జూనియర్‌ అసిస్టెంట్లు, 56 డ్రైవర్‌ అపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. పోలీసు నియామక బోర్డు ద్వారా స్టేషన్‌ఫైర్‌ అధికారులు, ఫైర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే జూ.అసిస్టెంట్‌ పోస్టులను పబ్లిక్‌సర్వీస్‌ కమీషన్‌ ద్వారా, డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు శాఖా పరమైన ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు.
====