పోలవరం నిర్మాణంపై అనేక అనుమానాలు?

polavaram project works
polavaram project works

పోలవరం నిర్మాణంపై అనేక అనుమానాలు?

–పోలవరం గడువులోపే పూర్తంటూ కమిటీల ఏర్పాటు
–వాపోస్‌ కన్సల్టెన్సీ పరిశీలన
–త్రిమ్యాన్‌ కమిటీ నివేదికపైరాని క్లారిటీ
–పేచీ అంతా 2013 అంచనాల వ్యయంపైనే ?
–మోకాలడ్డుతున్న బిజేపీ రాష్ట్రనేతలు
–ట్రాన్స్‌ట్రా§్‌ు వైపే కేంద్రం మొగ్గు

అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గడువులోపే పూర్తిచేస్తామని కేంద్రం అంటూనే రోజుకోక కమిటీని పోలవరంపై ఏర్పాటుచేయడం,ఆకమిటీలను ప్రాజెక్టు నిర్మాణం సైట్‌కు పంపుతూ వస్తుండడంతో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.పోలవరంపై కేంద్రంకు వచ్చిన ఫిర్యాదులు,అనేక అనుమానాలతో రోజుకొక కమిటీని ఏర్పాటుచేసి పోలవరం ప్రాజెక్టు సైట్‌కు పంపి నివేదికను కోరారు.తాజాగా వాపోస్‌ కన్సల్టెన్సీ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు ఆకమిటి సీఈఓ ఎఎన్‌ఎన్‌ ప్రసాద్‌ నేతృత్వంలో రాష్ట్రం పంపిన నివేదికలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటివరకు సిడూబ్యూసి,సీపిఎ,త్రిమ్యాన్‌,నేషనల్‌ హైడ్రాలిక్‌ పవర్‌ కమిటీలు ప్రాజెక్టును సందర్శించి చివరిసారిగా ఈనెల 7న జలవనరుల శాఖ కేంద్రమంత్రి నతిన్‌ గడ్కిరీకి నివేదికను అందజేశారు.కేంద్రజలవనరుల శాఖ కార్యదర్శి యూపిసింగ్‌,కమిషనర్‌ ఓరాలు రాష్ట్రజలవనరుల కార్యదర్శి శశిభూషన్‌కుమార్‌,ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులతో సంప్రదింపులు చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారే తప్పా,వ్యయం గురించి పాత బకాయిలు,పునావాసం,పరిహారంపై క్లారిటీ ఇవ్వలేదు.గడువులోపే ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రానికి సహకరిస్తామని ప్రకటించడం పాత బకాయిల్లో కేవలం రూ.318.22కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది

.రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం రూ.11వేలకోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు చెబుతున్నారు.పోలవరం సైట్‌లో ఆరువందల యంత్రాలు,నాలుగువేల మంది,విదేశీయంత్రాలతో పాటు నిపుణులు పనిచేస్తున్నారు.అయితే పోలవరం నిర్వాసితులకు పరిహారం,పునరావాసం నిమిత్తం రూ.33,600కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడంతో జలవనరుల శాఖ మాత్రం తాము ప్రాజెక్టు నిర్మాణమే చెల్లిస్తామని,పునరావాసాం,నిర్వాసితులకు నష్టపరిహారం ఆర్థిక శాఖకే సంబంధమని తేల్చి చెబుతున్నారు.2013కంటే మునుపు అంచానాలకే చెల్లింపులని కేంద్రం అంటుండగా రాష్ట్రం 2013చట్టప్రకారం చెల్లించాలని అంటున్నందున పేచీ అంతా నిర్వాసితుల సమస్యపైనే కేంద్ర,రాష్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకొనింది.పనిలో పనిగా బిజేపీకి చెందిన పలువురు రాష్ట్రనేతలు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలతో ప్రాజెక్టు వ్యయంపై అనుమానాలు వచ్చే విధంగా మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే కేంద్రమంతి గడ్కరి బుధవారం రాష్ట్ర ఎంపిలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో సమావేశమై గడువులోపే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు తప్ప నిధుల విడుదల పై క్లారిటీ ఇవ్వలేదు.అలాగే విభజన చట్టం 60’సిప్రకారం మరో కారట్రాక్టర్‌తో పనులు చేపట్టి ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంకు రాష్ట్రం పిలిచిన టెండర్లపై ఊసేలేదు.ప్రస్తుత కారట్రాక్టర్‌ అయిన ట్రాన్స్‌ట్రా§్‌ు సంస్థకు సిమెంట్‌,స్టీలు కొరతలేకుండా రెండు మూడు నెలలకు సరిపడే విధంగా అప్పుగా కేంద్రప్రభుత్వరంగ సంస్థనుంచి సరఫరా చేస్తామని ప్రకటించారు.అలాగే పనులు వేగవంతం చేయడానికి సాంకేతిక నిపుణులను కూడా పంపుతామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విదేశాలనుంచి యంత్రాలు,నిపుణలను రప్పించి పనులుచేస్తున్న విషయాన్ని కేంద్రం మరిచినట్లుగా ఉంది. గడ్కరీ ప్రతి 15రోజుల కొకమారు పోలవరం సందర్శిస్తాననిచెప్పి శుక్రవారం రావాల్సి ఉండగా శనివారానికి వాయిదా వేసి అనంతరం శనివారం కూడా రానని ప్రకటిస్తూ నెలకొకమారు పోలవరాన్ని సందర్శిస్తారని రాష్ట్ర బిజేపి అధ్యక్షులు కె.హరిబాబు ప్రకటించారు.దీన్నిబట్టి చూస్తూ తాజాగా పోలవరం పనుల నిమిత్తం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక అనంతరం గడ్కరీ రానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టు స్పిల్‌వే,డయాఫ్రం వాల్‌ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి

దిగువ కాఫర్‌డ్యాం పనులకు శ్రీకారం చుట్టినా,ఎగువ కాఫర్‌డ్యాం నిర్మాణంపై ఎన్‌హెచ్‌పీసీ కమిటీ,డ్యాం డిజైన్‌ కమిటీ ఇంతవరకు అనుమతులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సందిగ్దంలో పడేసింది.కేంద్రమంత్రి హామీ గడువు కూడా ముగిసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం,నిర్వాసితుల వ్యయం మొత్తం రూ.58,319.06కోట్ల వ్యయంతో సవరించి తాజాగా కేంద్రానికి నివేదికలు పంపారు.ఈ వ్యయంపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ,జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ,రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన వాణిజ్య శాఖమంత్రి సురేష్‌ప్రభులను రాష్ట్రానికి బిజేపికి చెందిన ఎంపిలు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల తో సంప్రదింపులు చేయించారు.

అయితే మంత్రులు ఏ ఒక్కదానిపై క్లారిటీ ఇవ్వలేదు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపే పూర్తి చేస్తామని 2019నాటికి ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన వ్యయం విడుదలపై పరిశీలనలోనే ఉన్నారే తప్పా విడుదల చేయలేదు.రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం విభజన చట్టం మేరకు ఇప్పటివరకు రూ.12,191.78కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.అయితే పోలవరం ప్రాజెక్టు వ్యయంపై నోరు మెదపడంలేదు.మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు వివాదం రోజుకోక మలుపుతిరుగుతుందే తప్పా వ్యయంపైకాని,కాంట్రాక్టర్‌ విషయంలో రెండవ టెండర్‌పై నిగ్గు తేల్చక పోవడంతో కేంద్రంపై మరోమారు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..