పేరుపేరునా పలుకరించి సూచనలు

PM  MODI
PM MODI

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా జరిగిన ప్రపంచంలోని వివిధ సంస్థల సిఇఒల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మోడీ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలుకరించి సూచనలు సలహాలు అడిగారని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల, రిలయెన్స్‌ ఛైర్మన్‌ ముకేష్‌ అంబాని, ఐసిఐసిఐ బ్యాంకు ఛైర్మన్‌ చందా కొచ్చార్‌, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ తదితరులు పాల్గొన్నారు.