పెర్ఫార్మన్స్‌ పాత్రలకే నా ప్రాధాన్యత!

LASYA2
LASYA2

పెర్ఫార్మన్స్‌ పాత్రలకే నా ప్రాధాన్యత!

ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రేవంత్‌, నోయల్‌, హేమంత్‌, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం రాజా మీరు కేక. కష్ణ కిషోర్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా లాస్య పాత్రికేయులతో సినిమా సంగతులను తెలియజేశారు.

లాస్య మాట్లాడుతూ.. రాజా మీరు కేక చిత్రంలో నా పాత్ర పేరు శ్వేత. గొప్పింటి అమ్మాయిగా పుట్టిన శ్వేత తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో దిగువ మధ్య తరగతి అమ్మాయిగానే పెరుగుతుంది. ఇప్పటి వరకు నేను టీవీ షోస్‌కే పరిమితం అయ్యాను. రాజా మీరు కేకలో నా పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగా నచ్చింది. నేను, హేమంత్‌, నోయల్‌, రేవంత్‌ నలుగురు మంచి స్నేహితులుగా కనడపడతాం. తారకరత్నగారు పవర్‌ఫుల్‌ విలన్‌గా కనపడతారు. విలన్‌ వల్ల ఈ స్నేహితులకు ఎలాంటి కష్టం వచ్చింది. దానికి ఈ స్నేహితులు ఎలా రియాక్ట్‌ అయ్యి ప్రతీకారం తీర్చుకున్నారనేదే కథ. ఈ సినిమాతో స్నేహం అంటే ఎలా ఉంటుందనేది అర్థం అయ్యింది. నిజ జీవితంలో నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరూ లేరు. ఈ సినిమాతో నాకు ముగ్గురు మంచి స్నేహితులు దిరికారు. ఈ సినిమాలో ఓ లవ్‌ సాంగ్‌, ఫ్రెండ్‌ ఫిప్‌ సాంగ్‌, ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నాయి. నాకు గ్లామర్‌ కంటే పెర్‌ఫార్మెన్స్‌ పాత్రలంటేనే ఇష్టం. వాటికే ప్రాధాన్యతనిస్తాను.

ఈ సినిమాలో శ్వేత పాత్రలో పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉందనిపించి ఒప్పుకున్నాను. నటనను ప్రత్యేకంగా నేర్చుకోలేదు. దర్శకుడు కష్ణ కిషోర్‌గారు నాలో నమ్మకాన్ని పెంచి శ్వేత పాత్రను చేయడానికి ఒప్పించారు. యాంకరింగ్‌ కంటే యాక్టింగ్‌ నటించడం చాలా కష్టమని తెలిసింది. అన్నీ వేరిషయన్స్‌లో నటించడం అనేది అంత సులభం కాదు. ప్రస్తుతం పెళ్ళి కారణంగా టీవీ షోస్‌కు బ్రేక్‌ తీసుకున్నాను. సోలో, డిఫరెంట్‌ కాంబినేషన్‌లో షోస్‌ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మంజునాథ్‌తో నేనే ఆరేడేళ్ళ ప్రయాణం చేశాను. తర్వాతే ఇద్దరం కుటుంబ సబ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మంజునాథ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇద్దరం ఓకే కంపెనీలో కొన్ని రోజుల పాటు కలిసి పనిచేశాం. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య లవ్‌ పుట్టింది. టీవీ రంగంలోకి వచ్చే ముందు మంజునాథ్‌ లవ్‌ ప్రపోజల్‌ను ఒప్పుకునేవచ్చాను. ప్రతి చిన్న విషయాన్ని తనకు చెబుతుంటాను. నా కుటుంబ సబ్యులు ఒప్పుకుంటేనే నేనేదైనా చేయగలను. నేను మరో సినిమాలో కూడా నటించబోతున్నాను. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.