పెరిగిన ఉత్సాహంతో పనిచేయాలి

Babu
Chandrababu Naidu

పెరిగిన ఉత్సాహంతో పనిచేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. కార్యకర్తలు పెరిగిన ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన తెలంగాణ తెదేపా విస్తృతస్తాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.. విభజన వల్ల ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. నాయకుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదన్నారు. తెలంగాణలో జిల్లాలు పెరిగిన కారణంగా ఉత్సాహంగా పనిచేయాలన్నారు.కార్యక్రమంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, ఉమా మాధవరెడ్డి, గరికపాటి రామమోహనరావు, సండ్ర వెంకట వీరయ, రావుల , నామా నాగేశ్వరరావు, కొమ్మినేని వికాస్‌, బుచ్చిలింగం, అమర్‌నాధ్‌ బాబు, ఓంటేరు, ఎమ్మెన్‌ శ్రీనివాస, సారంగపాణి, వనం రమేష్‌ ప్రభృతులు ప్రసంగించారు.