పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది: జైట్లీ

arun jaitly
arun jaitly

ఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రద్దయిన నోట్లలో
దాదాపు 90శాతం తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఇదంతా పెద్ద కుంభకోణం
అని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఆరుణ్‌జైట్లీ స్పందించారు. పెద్దనోట్ల రద్దు ఫలితం ఊహించినట్లే
సానుకూలంగా ఉందని, దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని జైట్లీ తెలిపారు. అయితే రద్దు మూలంగా
బ్యాంకుల్లోకి చేరిన డబ్బంతా చట్టబద్దం కాదని, ‘రద్దయిన నోట్లన్నీ బ్యాంకులోకి తిరిగి చేరాయి అంటే.. ఆ సొమ్మంతా
చట్టబద్దమైనది ఆని అర్థం కాదని, పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనం పూర్తిగా నిర్మూలన అయిందని ఎవరూ చెప్పలేరని
అన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ అనే అంశాలు ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచాయని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు
దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరుతాయని…అందుకే ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఈ ప్రక్రియ చేపట్టామని జైట్లీ
స్పష్టం చేశారు.