పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణయం తీవ్ర‌వాదుల‌కు పెద్ద దెబ్బః నిర్మలా

Nirmala Seetha raman
Nirmala Seetha raman

చెన్నై: మోదీ ప్రభుత్వం నోట్లరద్దు అమలుచేసి ఏడాది కావస్తున్న సందర్భంగా నవంబర్ 8ని ‘నల్లధన వ్యతిరేక దినోత్సవం’గా పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని తమిళనాడు బీజేపీ యువజన విభాగం బుధవారం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తీవ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు నోట్లరద్దు నిర్ణయం అద్భుతంగా ఉపయోగపడింది. కశ్మీర్‌లో వేలాదిగా రోడ్లపైకి వచ్చి రాళ్లురువ్విన అల్లరిమూకలు… చేతికి డబ్బులు అందకపోవడంతో కిక్కురుమనకుండా వెనక్కెళ్లిపోయాయి…’’ అని నిర్మల వ్యాఖ్యానించారు.