పెథాయ్ తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో పర్యటన

AP CM Chandra babu Naidu-1
AP CM Chandra babu Naidu

Amaravati: సీఎం చంద్రబాబు పెథాయ్ తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో పర్యటించనున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లి వచ్చిన అనంతరం ఆర్టీజీఎస్ కేంద్రం నుండి సమీక్ష నిర్వహించిన సీఎం తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో పర్యటన చేయనున్నామని చెప్పారు. మొత్తం 14 లక్షల హెక్టార్ల మేర పంట నష్టం జరిగిందని ప్రాధమిక అంచనాకు వచ్చామని.. ప్రాణ, పశు నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. ముందస్తు చర్యల వలన వీలైనంత వరకు పంట నష్టం కూడా తగ్గించగలిగామని..తుఫాన్ కదలికలు.. ఎక్కడ తీరం దాటనుంది అన్నది కూడా పసిగట్టగలిగామన్నారు. సముద్రంలోని జాలర్లను వెనక్కు రప్పించడం, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం, రేయింబవళ్లు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈనెల 19 నాటికి నష్టాన్ని అంచనావేసి 20 న నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.