పెట్టుబడుల కోసం రండి

This slideshow requires JavaScript.

పెట్టుబడుల కోసం రండి

టెక్స్‌టైల్‌ ఇండియా-2017 సదస్సులో
పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
-ఎపిలో ‘ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ వాతావరణం
– నేతపరిశ్రమకు శతాబ్దాల చరిత్ర
-జౌత్సాహికులకు అన్నివిధాలా ప్రోత్సాహం

ఎపి సచివాలయం:, జూన్‌ 30, ప్రభాతవార్త: వస్త్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశం పెట్టింది పేరు, నైపుణ్యం గల మానవ వనరులు మా సొంతం ఎపికి రండి.. మీ పెట్టుబడులకు భరోసా కల్పిస్తామని సిఎం చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. జౌళి పర్శిమ మనుగడకు అవసరమైన ప్రోత్సాహకాలు కల్పిస్తామని, గ్రాణీమప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపయాలను ఏర్పాటుచేస్తామని ఆయన హామీ నిచ్చారు..శుక్రవారం గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో కేంద్రజౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ‘టెక్స్‌టైల్‌ ఇండియా-2017 జాతీయ స్థాయి ప్రదర్శన, సదస్సులో పాల్గొన్నారు. వస్త్రపరిశ్రమ విస్థృతికి ఆంధ్రప్రదేశ్‌లో గల అవకాశాలపై ఈసందర్భంగా సిఎం మాట్లాడారు.. ఎపిలో చేనేత పరిశ్రమకు శతాబ్దాల చరిత్ర ఉందని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నేత పరిశ్రమకు ఆలవాలంగా నిలిచాయని గుర్తుచేశారు. ఏ పరిశ్రమ నిలదొక్కుకోలేదని, వస్త్రపరిశ్రమ కూడ ప్రస్తుతం అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. ఆధునిక అభిరుచులకు తగినట్టుగా ఎప్పటికపుడు సరికొత్త ఆకృతులతో ముందుకొచ్చే సంస్థలే వినియోగదారుల ఆదరణను చూరగొంటున్నాయనిచెప్పారు.. ఎపిలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయని చెబుతూ, అంతర్జాతీయ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దుకునిఅందుకు తగత మార్కెటింగ్‌ సామర్ధ్యాన్నిసమకూర్చుకోవటం ముఖ్యమని అన్నారు.. ఎపిలో ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలని ముందుకొచ్చే జౌత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామాని హామీ నిచ్చారు. పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి తక్షణం ప్రోత్సామకాలు అందిస్తామన్నారు.. ఎపిలో ‘ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నదని వివరించారు.
పరిశ్రమలు స్థాపించేవారికి తమ అధికారులు తగిన విధంగా మార్గదర్శకం చేస్తారని, ఎప్పటికపుడు సమీక్షలు చేస్తూ తాను అండగా ఉంటానని చెప్పారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడిక్కడే టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటుచేసి చిన్నతరహా పరిశ్రమ యజమానులకు అండగా ఉండాలని ఈ సదస్సులో వచ్చిన సూచనపై వెంటనే అధికారులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..ఈ సెక్టారులో విస్తృత అవకాశాలు ఉంటాయని, ప్రభుత్వం గుర్తించిన వృద్ధిచోదకాల్లో ఈపరిశ్రమ కూడ ఉందని తెలిపారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పే చిన్నతరహా వస్త్ర పరిశ్రమల్లో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.. ఎపిలో చేనేత, జౌళి, నూలు, పట్టు వస్త్రపరిశ్రమ అభివృద్ధికి తగిన ప్రోత్సాహం కల్సిస్తామన్నారు.. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశామని, పరిశ్రమకు అవసరమైన అన్ని బాగోగులూ ఈ విభాగం చూస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఇబ్బంది లేదని , ప్రస్తుతం మూడో తరం విద్యుత్‌ సంస్కరణల బాటపట్టి సౌరవిద్యుత్‌ ఉత్పాదనపై దృష్టిపెట్టామని వివరించారు. రానున్న అతికొద్ది కాలంలో విద్యుత్‌ చార్జీలను తగ్గించటానికి కృషిచేస్తున్నామన్నారు.

వస్త్రపరిశ్రమ నిలదొక్కుకునేలా పాలసీలో మార్పులు

వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకునేలా పాలసీలో అవసమైన మార్పులు చేసి సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమ్తంరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరారు.. కేంద్ర కొత్త పాలసీని వెలువరిస్తే దానికి తగినట్గుఆ రాష్ట్రస్థాయిలో మరిన్ని ఆకర్షణలతో తమవిధానాన్ని ప్రకటించేందుకు వీలు కలుతుతుందన్నారు. టెక్స్‌టైల్‌ ఇండియా -2018 జాతీయ స్థాయి ప్రదర్శన- సదస్సును వచ్చే ఏడు ఆంధ్రప్రదేశ:లో ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి సూచించారు.

తనలాంటివారెందరికో చంద్రబాబు స్ఫూర్తి: స్మృతి ఇరానీ

ఈసందర్భంగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ మాట్లాడుతూ., మరొకరైతే ఇటువంటి నిర్ణయాలు ప్రకటించే ముందు తమ మంత్రిమండలి సమావేశాల్లో చర్చించాలని చెబుతారని, ఎపి ముఖ్యమంత్రి తడుముకోకుండా నిర్ణయాలు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య చకితుల్నిచేస్తారని అన్నారు.. తాను ఎపి ముఖ్యమంత్రిని కలిసిన ప్రతి సందర్భంలోనూ కొత్తగా ఏదైనా నేర్చుకుంటూనే ఉన్నాని ఆమె వ్యాఖ్యానించారు. తనలాంటి ఎంతోమందికి చంద్రబాబు స్ఫూర్తిగా నలిచారనిఅన్నారు.. సదస్సులో రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనరేేష్‌, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌, ఇడిబి సిఇఒ జాస్తి కృష్ణకిషోర్‌,సిఎంఓ కార్యదర్శులు సతీష్‌చంద్ర,సాయిప్రసాద్‌తదితరులు పాల్గొన్నారు.