పెట్టుబడి మద్దతు పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం

KCR
KCR

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పెట్టుబడి మద్దతు పథకంపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘానికి అధ్యక్షులుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులుగా మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిని నియమించారు. ఈ బృందం పెట్టుబడి మద్దతు విధానంపై అధ్యయనానికి దేశ వ్యాప్తంగా పర్యటించనుంది. అయితే, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అధికారుల బృందం దేశ వ్యాప్తంగా పర్యటించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ రెండు బృందాల లక్ష్యం.. నిరాశ, నిస్పృహలో ఉన్న రైతులకు చేయూత నివ్వడమేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.