పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం

111

పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం

భువనేశ్వర్‌: ప్రపంచ ఖ్యాతినొందిన పూరీ జనన్నాథునిస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేవదేవుడు బలరాముడు, సుభద్ర సమేతంగా గుండిచా దేవాలయానికి వెళ్లేందుకు ముందుగా పయనం సాగించారు. 9రోజులపాటు జరిగే ఈ యాత్రకు తిలకించటానికి దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్ధం ఈస్ట్‌కోస్ట రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోడీ ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. జగన్నాధుని ఆశీస్సులు ప్రతిఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. ఒడిసా సిఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్రమంత్రి మేనకాగాంధీ, వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌, రాజస్థాన్‌ సిఎం వసుంధరా రాజే శుబాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.