పాస్ పుస్త‌కాలు, చెక్కుల పంపిణీ

Kadiyam Srihari
Kadiyam Srihari

హైద‌రాబాద్ః రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న రైతులందరికీ రైతుబంధు చెక్కులతో పాటు పాస్‌పుస్తకాల పంపిణీ ద్వారా దేశంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందనీ, ఈ ఘనత మొత్తం పరిపాలనా సామ ర్థ్యం కలిగిన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్‌లో నిర్వహించిన రైతుబంధు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన నిర్వహించగా, కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మే 10 నుంచి 17 వరకు రైతులందరికీ చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ ఏకకాలంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆరు గంటల విద్యుత్ కూడా సరిగా ఉండేది కాదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని గుర్తు చేశారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో లేనప్పటికీ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, దాని తొలి ఫలితం పూర్వపు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా రైతులకు దక్కుతుందన్నారు. పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకతీతంగా భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి పెట్టుబడి సా యం అందించడం జరుగుతోందన్నారు.