పాస్‌లు ఉంటేనే వేడుకకు రండి

pawanffff

సినిమాల నుంచి తప్పుకోను

హైదరాబాద్‌: సినిమాల నుంచి తప్పుకోనని పవర్‌స్టార పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఆదివారం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో విడుదల వేడుక సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడియో వేడుకలో రాజకీయ వ్యాఖ్యలు చేయనని అన్నారు. విదేశీ అతిథులు వస్తున్నందునన పోలీసులు వేడుకలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యఅతిథిగా అన్నయ్య చిరంజీవిని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

పాస్‌లు ఉంటేనే వేడుకకు రండి

పాసులు లేని అభిమానులు వేడుకకు రావద్దని పవన్‌ కోరారు. ఫంక్షన్‌కు రాలేనివారు టివిలోనే కార్యక్రమం చూడాలన్నారు. సెక్యూరిటీ లేని కారణంగా ఆడియో వేడుకకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. అభిమానుల పేరుతో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారని, అందువల్లే పాసులు ఉన్న వారు మాత్రమే ఫంక్షన్‌ నిర్వహణకు సహకరించిన మంత్రులు కెటిఆర్‌, హరీష్‌రావు, పోలీసు ఉన్నతాధికారులకు పవన్‌కళ్యాణ్‌ కృతజ్ఞతలు చెప్పారు.