పార్టీ అధ్యక్షుడిని నేనే

Mulayam Singh Yadav
Mulayam Singh Yadav

పార్టీ అధ్యక్షుడిని నేనే

న్యూడిల్లీ: సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు తానేనని ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం ఇక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన అఖిలేష్‌యాదవ్‌, రాంగోపాల్‌ వర్మలపై నిప్పులు చెరిగారు.. అఖిలేష్‌యాదవ్‌ యుపి సిఎం మాత్రమేనని అన్నారు. రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా శివపాల్‌యాదవ్‌ను నియమించినట్టు ములాయం పేర్కొన్నారు.. పార్టీ సమావేశాలు నిర్వహించే అధికారం రాంగోపాల్‌ యాదవ్‌కు లేదని చెప్పిన ములాయం ఆయన్ని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో రాంగోపాల్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించటం ఇది మూడోసారి.