పాఠశాల గదుల్లోకి చిరుత

tiger
బెంగళూరు: నగరంలోని ఒక పాఠశాలలోకి ఓ చిరుత అమాంతంగా చొరబడింది. ఇక్కడి వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని ఒక విబ్‌జియార్‌ పాఠశాలల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక చిరుత పులి తరగతి గదుల మధ్య సంచరించిన చిత్రాలు సిసి కెమెరాలో కన్పించాయి. అదివారం ఉదయం సిసి కెమెరా పుటేజ్‌లను చూసిన సిబ్బంది నిర్ఘాంతపోయారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ అధికారులకు కబురంపారు. దీంతో వారు రంగం ప్రవేశం చేశారు. పాఠశాల ఆనుకుని ఉన్న స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద ఒకరితో కొట్లాడిన సంఘటన కూడ జరిగింది. కాగా అతను స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎట్టకేలకు పులిని సాయంత్రం పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 4గురు గాయపడ్డారు. ఇదే పాఠశాలలో నాలుగేళ్ల క్రితం కూడ చిరుత సంచరించిందని స్థానికులు తెలిపారు.

tiger1