పాక్ లో ఉన్న త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన చైనా!

pak and china
pak and china

బీజింగ్‌: చైనాకు భ‌యం ప‌ట్టుకున్న‌ట్లుంది. దీనికి కార‌ణం పాకిస్థాన్‌లో ఉంటున్న తమ దేశ ప్రజలపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న చైనీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రత లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన నిర్మాణ పనుల నిమిత్తం చైనాకు చెందిన వందలాది కార్మికులు, పలు కంపెనీల ఉద్యోగులు పాకిస్థాన్‌ వెళ్లారు. అయితే అక్కడ ఉన్న చైనీయులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం తగు జాగ్రత్తలు చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. బయట ప్రదేశాలకు వెళ్లడం వీలైనంత మేర తగ్గించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని పలు సూచనలు చేసింది. ఏమైనా అత్యవసర సహాయం కావాలంటే వెంటనే చైనా రాయబార అధికారులను అప్రమత్తం చేయాలని, పాకిస్థాన్‌ పోలీసులు, ఆర్మీ సాయం తీసుకోవాలని సూచించింది. చైనా రాయబార కార్యాలయం సూచనలు చేయడంపై పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.