పాక్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ జోరు

PAK ELECTIONS
PAK ELECTIONS

పిటిఐ 97, నవాజ్‌ పిఎంఎల్‌-62, పిపిపి-28
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో క్రికెట్‌మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌నేతృత్వంలోని పాకిస్తాన్‌ ఇ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌(పిటిఐ)పార్టీ దూసుకుపోతోంది. మొత్తం 272 స్థానాలున్న అసెంబ్లీకి 249 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ ఎన్‌ పార్టీ 62 స్థానాల్లో గెలిస్తే ఇమ్రాన్‌ఖాన్‌ పిటిఐ 97స్థానాల్లో ఆధిక్యంలోఉంది. ఇక దివంగతప్రధాని బేనజీర్‌భుట్టో పార్టీ పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ (పిపిపి)మూడోస్థానానికే పరిమితం అయింది. మొత్తం 28 స్థానాలుమాత్రమే వచ్చాయి. ఇవికాకుండా ఎంఖ్యూఎం సపార్టీకి ఏడు, ఎంఎంఎకు ఏడుస్థానాలు వచ్చాయి. భారత్‌పై ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్‌ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో ఓట్లలెక్కింపుపై షరీఫ్‌ పార్టీ అధికారప్రతినిధి మర్రియమ్‌ ఔరంగజేబ్‌ అభ్యంతరాలు వ్యక్తంచేసారు. పోలింగ్‌కేంద్రాలనుంచి తమ పార్టీ ఏజెంట్లను బలవంతంగా బైటికి పంపించేసారని ఆరోపించారు.తలుపులుమూసి ప్రక్రియ కొనసాగించారని, ఫారమ్‌ 45లో భారీ మార్పులుచేసారని ఆరోపించారు. పాకిస్తాన్‌లో ఎన్నికలసందర్భంగా జరిగిన అల్లర్లలో 31మంది చనిపోగా మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.