పాక్‌ వర్సిటీపై ఉగ్రదాడి: 21మంది విద్యార్థుల మృతి

PAL2PAK1FFFFFపాక్‌ వర్సిటీపై ఉగ్రదాడి: 70మంది విద్యార్థుల మృతి
ఇస్లామాబాద్‌: పాక్‌లోని విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌లోని బచాఖాన్‌ వర్సిటీపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 21 మంది విద్యార్థులను వారు కాల్చిచంపారు.
సాయుధ ఉగ్రవాదులు వర్సిటీ క్యాంపస్‌లోనికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలిసింది. కాగా ఈ ఘటనపై పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఖండించారు. కాగా దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో నలుగురిని ఖతం చేసినట్టు పాక్‌ ఆర్మీ ప్రకటించింది. తామే ఈ దాడికి పాల్పడినట్టు తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ ప్రకటించింది. ఉగ్రదాడికి గురైన వర్సిటీ ప్రాంగఱాన్ని తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు సందర్శించనున్నారు. మరోవైపు సైన్యం కథనం ప్రకారం ఇప్పటి వరకు వర్సిటీ ఆవరణ నుంచి 70మందిని సురక్షితంగా బయటకు తెచ్చినట్టు తెలిపింది. ఈ దాడిలో వర్సిటీ ప్రొఫెసర్‌ కూడ ఒకరు మరణించినటు తెలిసింది. దాదాపు 21 మంది విద్యార్థులను ఉగ్రవాదులు అతిదగ్గర నుంచి కాల్పులు జరిపి వారిని కాల్పిచంపారు.