న‌గ‌ర వాసుల‌కు త‌ప్ప‌ని వ‌ర్షం క‌ష్టాలు!

Heavy Rain
Heavy Rain

హైద‌రాబాద్ః న‌గ‌ర వాసుల‌కు వ‌ర్షం క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ప‌లు ప్రాంతాల్టో మ‌రోసారి జోరు వాన కురుస్తోంది. అటు బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, నాగార్జున స‌ర్కిల్‌, అమీర్ పేట్, ఎస్సార్‌న‌గ‌ర్‌, ఎర్ర‌గ‌డ్డ‌, యూస‌ఫ్ గూడ‌, మోతీ న‌గ‌ర్, భ‌ర‌త్ న‌గ‌ర్, ఇటు అంబ‌ర్‌పేట్‌, విద్యాన‌గ‌ర్‌, రామాంత‌పూర్‌, తార్నాక‌, హ‌బ్సిగూడ, ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డుతోంది. ప‌లు కూడ‌ళ్ల వ‌ద్ద ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. క‌ర్ణాట‌క‌, ఒడిశా, తెలంగాణ మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం స్థిరంగా ఉండ‌టంతో మ‌రో 48 గంట‌లు ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.