న్యూయార్క్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

oscarffff

న్యూయార్క్ లో ఈ సంవత్సరపు ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతోంది. ఇప్పటివరకూ ఇచ్చిన అవార్డుల్లో ఉత్తమ సహాయనటుడి అవార్డును శామ్ రాక్ వెల్ సొంతం చేసుకున్నాడు. ‘త్ర్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’లో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి అవార్డు అల్లీసన్ జెన్నీ (ఐ టోన్యా) సొంతమైంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ‘ఎ ఫెంటాస్టిక్ ఉమెన్’ (సెబాస్టియన్ లిలియో, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ గా ‘ఇకారస్’ (బ్రియాన్ ఫోజెల్, డాన్ కోగన్), ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ గా ‘కోకో’ (లీ అన్ క్రిక్, డార్లా కే ఆండర్ సన్), ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ‘డియర్ బాస్కెట్ బాల్’ (కే బ్రియాంట్, జీన్ కేనీ), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గా గెర్డ్ ఫెక్చర్, రిచర్డ్ ఆర్ హూవర్, జాన్ నీసన్ (బ్లేడ్ రన్నర్ 2049)లు అవార్డులను దక్కించుకున్నారు. ఉత్తమ వస్త్రాలంకరణ అవార్డు మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)కు, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు మార్క్ వెంగర్టెన్ (డన్ క్రిక్)కు లభించాయి. అవార్డుల వేడుక కొనసాగుతోంది.