నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు

AP CM in Assembly
AP CM Chandrababu in Assembly

నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు

అమరావతి: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు.. అసెంబ్లీ సమావేశాలు జరిగేటపుడు ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలన్నారు.. ప్రతిపక్షానికి అసెంబ్లీ అన్న, స్పీకర అన్నా.. కనీస గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైకాపా రానురాను దివాళా కోరు పార్టీగా తయారవుతోందని అన్నారు.. అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ ఎపి ముందంజలో ఉందని పొరపాటున చెప్పానని, పొరపాటుగా చెప్పిన మాటను సరిచేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.