నేపాల్‌, భూటాన్‌లకు ఆధార్‌తో ప్రయాణం

AADHAR
AADHAR

వీసారహిత ప్రయాణాలకు హోంశాఖ వెసులుబాటు
న్యూఢిల్లీ: భారత్‌, భూటాన్‌,నేపాల్‌లమధ్య కొన్ని వయోపరిమితులను అనుసరించి కేవలం ఆధార్‌సాయంతో వీసాలేనిప్రయాణాలుచేసేందుకు హోంమంత్రిత్వశాఖ సడలింపులు ఇచ్చింది. 15 ఏళ్లలోపు, 65 ఏళ్లకుపైబడిన వారు ఈ దేశాలను వీసాలేకుండానే కేవలం ఆధార్‌సాయంతోప్రయాణాలుచేయవచ్చని వెల్లడించింది. ఇకపై ఈమూడు దేశాలమధ్య ఆధార్‌కార్డు అధీకృత పత్రంగా నిర్ణయించింది. 15ఏళ్లలోపు, 65 ఏళ్లకుపైబడిన భారతీయులు నేపాల్‌, భూటాన్‌దేశాలు వీసాలేకుండానేప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఈ రెండు వయసులపరిమితిలోలేని వారికి మాత్రం ఈ నిబందనలు అమలులోనికి రావడని, వారికి వీసాలు అవసరం అవుతుందని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారతీయ పైరులు ఎవరైనా భూటాన్‌కు వెళ్లాలంటే ఇకపై వీసా అవసరంలేదు. వారికి పాస్‌పోర్టు ఉంటే ఆధార్‌కార్డుసాయంతోను, లేదా ఎన్నికలసంఘం జారీచేసిన గుర్తింపు కార్డుసాయంతో భూటాన్‌ పర్యటించవచ్చని వెల్లడించింది. అంతకుముందు 65 ఏళ్లకుపైబడిన వారు, 15 ఏళ్లలోపు ఉన్నవారు వారి పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్రప్రభుత్వ హెల్త్‌సర్వీస్‌ గుర్తింపుకార్డులు, రేషన్‌కార్డులు వీటిలో ఏదో ఒకటి గుర్తింపుగా చూపించాల్సి వచ్చేది. ఇకపై ఆధార్‌కార్డును చూపిస్తే సరిపోతుందనిహోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇపుడు తాజాగా ఆధార్‌కార్డును ఈ జాబితాకు జోడించింది. 12 అంకెల విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్యను యుఐడిఎఐ జారీచేస్తోంది. ఇపుడు దేశంలోని ప్రభుత్వ సర్వీసులకు ఇదే ప్రామాణికంగా నడుస్తోంది. ఖాట్మండులోని భారత రాయభార కార్యాలయానికి ఈ మార్గదర్శకాలనుసైతం అందచేసింది. అయితే ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం జారీచేసే అత్యవసర ధృవపత్రం ఒకసారి ప్రయాణించేందుకు అనుమతినిస్తుంది. 15నుంచి 18 ఏళ్ల బాలబాలికలు భారత్‌ నేపాల్‌దేశాలమధ్య వారి పాఠశాలల ప్రిన్సిపాళ్లు జారీచేసే ధృవపత్రాలతో ప్రయాణించే వీలుంటుంది.అదే ఒక కుటుంబం అంటే భార్యాభర్తలు, చిన్నపిల్లలు, తల్లితతండ్రులతో కలిసి ప్రయాణిస్తే ఎలాంటి దస్త్రాలు అవసరంలేదు. వారిలో ఒకరికి చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రాలుంటే సరిపోతుంది. అదికూడా ఆధార్‌లాంటిపత్రాలు సరిపోతాయని చెపుతోంది. ఇతర కుటుంబసభ్యులకు మాత్రం ఒక గుర్తింపుకార్డు ఫోటోతోసహా ఉండాలని సూచించింది. వాటిలో సిజిహెచ్‌ఎస్‌ కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు,స్కూలు,కళాశాల ఐడికార్డులు వంటివి చెల్లుబాటవుతాయి. ఇక భూటాన్‌కుప్రయాణించే భారతీయులు ఆరునెలలపాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు లేదా ఓటరు గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. భూటాన్‌ భారత్‌లోని సిక్కిమ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాస్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నది. మొత్తం 60వేలమందికిపైగా భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరంతా జలవిద్యుత్‌, నిర్మాణరంగాల్లోనే ఉన్నారు. అదనంగా మరో ఎనిమిది వేలు, పదివేల మంది రోజువారి కార్మికులు భూటాన్‌కు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తారు. సరిహద్దు పట్టణాలనుంచే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు.ఇక నేపాల్‌లో అయితే ఆరులక్షలమంది భారతీయులున్నారు. వారిలో వ్యాపారవేత్తలు, వర్తకులు నేపాల్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకన్నవారున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటి నిపుణులు సీజనల్‌ కార్మికులు, నిర్మాణరంగ ఉద్యోగులు పలువురు నేపాల్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. నేపాల్‌కు భారత్‌తో 1850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సిక్కిం, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలతో నేపాల్‌ సరిహద్దు ఉంది.