నేతలు వేరువేరుగా ప్రచారం

YEDDYURAPPA
YEDDYURAPPA

బెంగుళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు బిజెపి తీవ్రంగా కృషిచేస్తుంది. ఐతే అమిత్‌షా, మోది పాల్గొనే సభల్లో యడ్యూరప్ప కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో యడ్యూరప్ప స్వయంగా మీడియా ముందుకు వచ్చి అసలు విషయం వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో అందరితో కలిసి కాకుండా వేరుగా ప్రచార కార్యకమ్రాలు నిర్వహించాలనేది మోది, అమిత్‌షాల వ్యూహం అని యడ్యూరప్ప తెలిపారు. త్వరలో హస్సన్‌ ప్రాంతంలో ప్రచారం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం ఉండటంతో వీలైనంత త్వరగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు వివరించారు. తనతో పాటు కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ కూడా ఒంటరిగా ప్రచారాలు నిర్వహిస్తున్నానని అన్నారు.