నేడే పవన్ కళ్యాణ్ కు ‘ఇండియా బిజినెస్ ఫోరం’ ఎక్షిలెన్స్ అవార్డు

PAWAN KALYAN11
PAWAN KALYAN

పవన్ కళ్యాణ్ నేడు ఉదయం లండన్ చేరుకున్నారు. ‘ఇండియా బిజినెస్ ఫోరం’ ఎక్షిలెన్స్ అవార్డు అందుకోవడానికి పవన్ లండన్ వెళ్ళాడు. రెండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్ స్లెన్స్ అవార్డు కు పవన్ ఎంపిక అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రతినిధులు సునీల్ కుమార్ గుప్త, చంద్ర శేఖర్ పవన్ ఇన్విటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రెండు రోజులు పవన్ కళ్యాణ్ లండన్ లో గడుపుతారు. ఇటీవలే పవన్ యూరప్ లో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన అజ్ఞారవాసి జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాను చినబాబు నిర్మిస్తోన్నారు.