నేడు ఫ్లైఓవ‌ర్ల‌కు ,రోడ్ల‌కు శంఖుస్థాప‌న‌

TUMMALA, B RAMMOHAN
TUMMALA, B RAMMOHAN

హైద‌రాబాద్ః హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తీర్చేలా భారీ ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించనున్నారు. శనివారం దాదాపు రూ.1,523 కోట్ల విలువైన ైఫ్లెఓవర్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఉప్పల్, అంబర్‌పేట ైఫ్లెఓవర్లతోపాటు ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరులేన్ల రోడ్డు నిర్మాణానికి, ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో రాష్ర్టానికి 3,155 కిలోమీటర్ల జాతీయరహదారులను సాధించామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు సాంద్రత 2.2 మాత్రమే ఉండగా, ఇప్పుడు 4.1కి పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రీతిపాత్రమైన రీజినల్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేస్తున్నామని, దీనిని దాదాపు 338 కిలోమీటర్ల నిడివితో .. రూ.7,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.