నేటి మ్యాచ్‌లో ర‌హానేకు చోటు!

Ajinkya Rahane
Ajinkya Rahane

కొలంబోః నేటి జ‌ర‌గ‌బోయే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడడం లేదు. దీనికి కారణం, ధావన్ తల్లి అనారోగ్యంతో ఉండడమే. ఈ వార్త తెలియడంతో అతను హుటాహుటిన ఇండియాకి వచ్చేశాడు. దీంతో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న అజింక్యా రహానేకు జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వ‌చ్చాడు. ధావన్ దూరం కావడంతో నేటి మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ తో కలిసి రాహుల్ ఆరంభించనున్నాడు. మిడిల్ ఆర్డర్ లో రహానే బ్యాటింగ్ కు రావచ్చ‌ని స‌మాచారం.
మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.