నేటి నుంచి సెట్స్‌ పైకి

 

ntrrrr

సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపుదిద్దుకోనున్న సినిమా ‘జనతా గ్యారేజ్‌ . అనౌన్స్‌ చేసినప్పటినరుంచి సర్వత్రా ఆసక్తి కన్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.. ఇక మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ మరో ప్రధానపాత్రలో నటించనుండటం కూడ ఈ ప్రాజెక్టుకు ఓ ప్రత్యేక తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా సోమవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓచిన్న షెడ్యూల్‌ మూడు,నాలుగు రోజులపాటు కొనసాగనుందని తెలుసోతంది. ఆ తర్వాత సారధి స్టూడియోలో జనతా గ్యారేజ్‌ కోసం ప్రత్యేకంగా వేసిన ఓ భారీసెట్‌లో 40 రోజులకు పైనే షూటింగ్‌ జరగనుంది. ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీననర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను ఆగస్టు 12న విడుదల చేసేలా ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ప్లాన్‌చేశారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ ఈ భారీ బడ్జెట్‌ సినిమాను నిర్మిస్తోంది.