నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

DURGA
KanakaDurga in Indrakeeladri, Vijayawada

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వేంచేసిఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పండుగగా నిర్వహించటంతో రూ.2కోట్లతో భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంతంలో 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దసరా అలంకరణలో దర్శనమిస్తారు.