నెస్ట్‌లో నెగ్గితే భవితకు భరోసా

This slideshow requires JavaScript.

నెస్ట్‌లో నెగ్గితే భవితకు భరోసా

 

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ పిజి కోర్సుల్లో ప్రవేశం పొందటానికి ఉపకరించే పరీక్ష నెస్ట్‌ (నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌) ఈ పరీక్ష ముఖ్యాంశాలు. సమగ్రంగా సిద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకుందాం! జాతీయ ప్రవేశ పరీక్ష నెస్ట్‌లో మంచి స్కోరు తెచ్చు కుంటే నైసర్‌ (భువనేశ్వర్‌), ముంబయి యూనివర్సిటీ ఎటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్స్‌ సిఈబి ఎస్‌ (ముంబయి) సంస్థల్లో ఎంఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ రెండు సంస్థల్లో ఆత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, ఆధునిక కంప్యూటరేషనల్‌ సౌకర్యాలు ఉంటాయి.

ప్రముఖ శాస్త్రవేత్తలతో బోధన జరగటం చెప్పుకోదగ్గ ప్రత్యేకత. మౌలిక (బేసిక్‌) సైన్సు కోర్సులైన బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ మొదలైన సబ్జెక్టుల్లో ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ పిజి కోర్సులను ఇక్కడ సెమిస్టర్‌ విధానంలో అందిస్తున్నారు. ఈ కోర్సుల్లో చదవటానికి అర్హత సంపాదిం చిన విద్యార్థులకు భారత ప్రభుత్వం అందించే రూ.5,000 ఇన్‌స్పైర్స్‌ ఉపకార ఏడాదికి రూ.20,000. ప్రోత్సాహకం లభిస్తాయి. పిజి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు అధిక వేతనాలతో కూడిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉంటాయి. అంతే కాదు, బాబా ఎటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటర్వ్యూకు వీరికి నేరుగా అర్హత లభిస్తుంది. ఎవరు అర్హులు? ఇంటర్మీడియట్‌ 10+2ను 2015 లేదా 2016లో పూర్తిచేసిన ఎంపిసి, బైపిసి, ఎంబైపిసి విద్యార్థులూ, 2017 పరీక్ష రాసే ఈ గ్రూపుల విద్యార్థులూ 2017 పరీక్ష రాసే ఈ గ్రూపుల విద్యార్థులూ ఈ నెస్ట్‌-ప్రవేశపరీక్ష రాయటానికి అర్హులు.

జనరల్‌/ ఓబిసి క్యాటగిరీ విద్యార్థులకు ఇంటర్‌/10+2లో 60 శాతం అగ్రిగేట్‌ మార్కులుండాలి. ఎస్‌సిఎస్‌టి, పిడి విద్యార్థులకు 55 శాతం అగ్రిగేట్‌ మార్కులుండాలి. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సివుంటుంది. పరీక్ష ఎలా ఉంటుంది? పూర్తి ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే పరీక్ష ఇది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం ఐదు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి దాదాపు 50 మార్కుల వెయిటేజిని నిర్దేశిస్తారు.

సెక్షన్‌ 1:

ఇది జనరల్‌ సెక్షన్‌, మూడు గ్రూపుల వారూ తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సిన విభాగమిది. దీనిలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.

సెక్షన్‌ 2 నుంచి సెక్షన్‌ 5:

ఈ విభాగాల్లో సబ్జెక్టులవారీ ప్రశ్నలు ఉం టాయి. అంటే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ విభాగం ప్రశ్నల సెక్షన్లు, విద్యార్థులు ఈ అన్ని సెక్షన్లలోని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు. కానీ సరిగ్లా జవాబులు రాసిన మూడు సెక్షన్లను మాత్రమే పరిగణనలోక తీసుకుంటారు. ఈ విభాగాల్లోని ప్రశ్నలకు రుణాత్మక (నెగిటివ్‌) మార్కులు ఉంటాయి. ఈ ప్రవేశపరీక్ష రాయటానికి 3 గంటల సమయం కేటాయిస్తారు.

సన్నద్ధత ఎలా? నైసర్‌ విద్యా విధానమే సమ గ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రవేశపరీక్షలు కూడా ఆ స్థాయి లోనే ఉంటాయి. ప్రశ్నలన్నీ విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేవిధంగా ఉండటం నైసర్‌ ప్రత్యేకత. ఈ ప్రవేశ పరీక్షలో ప్రశ్నలు జెఈఈ ఆడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఉంటు న్నాయి. ఈ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు మొదట ప్రాథమిక భావనలను (బేసిక్‌ కాన్సెఫ్ట్స్‌) వృద్ధి చేసుకోవాలి. దీనికోసం తెలుగు ఆకాడమీ, సిబిఎస్‌ఈ ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలను చదివి, తర్వాత టాపిక్‌ వారీ రెఫరెన్స్‌ పుస్తకాల ద్వారా సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్య యనం చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళ నాలు, ఎస్‌ పి బ్లాక్‌ మూలకాలు, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ మూలకాలు, మెటలర్జీ మొదలైన అంశాలు ప్రధానమైనవి. ఫిజిక్స్‌ విభాగంలో జనరల్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌, ఎలక్ట్రీసిటీ, మ్యాగ్నటిజమ్‌, మెకానిక్స్‌ సంబంధిత సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

మేథమేటిక్స్‌ విభాగంలో కాల్‌క్యులస్‌, ట్రిగొనామెట్రీ, కో ఆర్టినేట్‌ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టర్స్‌ సంబంధిత సిలబస్‌ను అభాస్యం చేయాలి. అభ్యర్థులు బట్టీ పట్టే ధోరణిలో కాకుండా సబ్జెక్టును అవగా హన చేసుకుంటూ చదవాలి. విభిన్న అంశాలను అన్వయించ గలిగితే విజయం సాధ్యపడుతుంది. సబ్జెక్టును ఇష్టపడి చదవాలి. అశావహ దృక్పథంతో కష్టపడి అభ్యాసం చేస్తే మెరుగైన ర్యాంకుకు అస్కారం ఏర్పడుతుంది. గత ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో పరిశీలించి అవగాహన ఏర్పరచుకోవచ్చు.

సబ్జెక్టువారీగా.. మొత్తానికీ కటాఫ్‌ 1.ఒక అభ్యర్థి మొత్తం స్కోరు అనేది ఆ అభ్యర్థి జనరల్‌ విభాగం. ఇంకా అత్యుత్తమ స్కోరు సాధించిన మూడు సబ్జెక్టు విభాగాల్లో సాధించిన మార్కుల మొత్తంగా ఉంటుంది. 2. ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ 100 స్కోర్ల సగటులో 20 శాతం అనేదాన్ని ఆ విభాగానికి కటాఫ్‌ స్కోరు ళీలీతిళీ గా నిర్ణయిస్తారు. ఉదా: జనరల్‌ విభాగంలో అత్యుత్తమ 100 స్కోర్ల సగటు 40 మార్కులు అయితే జనరల్‌ విభాగానికి ఎస్‌మాస్‌ అనేది 40్ల0.2=8 మార్కులు అవుతుంది.

3.వేర్వేరు విభాగాలకు ఎస్‌మాస్‌ వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. 4. ప్రతి అభ్యర్థీ జనరల్‌, కనీసం మూడు సబ్జెక్టు విభాగాల్లో ఎస్‌మాస్‌ సమానమైన లేదా అధికమైన స్కోరు సాధించాలి. వీరిని మాత్రమే మెరట్‌ లిస్టు గణనలోకి తీసుకుంటారు. 5.జనరల్‌ విభాగం, కనీసం మూడు సబ్జెక్టుల్లో ఎస్‌మాస్‌ సాధించని అభ్యర్థులకు ఎలాంటి ర్యాంకునూ కేటాయించరు. వీరు ప్రవేశార్హతలు పొందలేదు. 6.ఒబిసి క్యాటగిరీ అభ్యర్థులు ఎస్‌మాస్‌ అనేది జనరల్‌ కేటగిరి అభ్య ర్థుల ఎస్‌మాస్‌లో 90 శాతం వర్తిస్తుంది. ఉదా: జనరల్‌ అభ్యర్థుల ఎస్‌మాస్‌ 8 అయితే ఒబిసి క్యాటగిరీ అభ్యర్థుల ఎస్‌మాస్‌ 8్ల0.9=7 (సుమారుగా) అవుతుంది.

7. ఎస్‌సి, ఎస్‌టి, పిడి క్యాటగిరీ అభ్యర్థుల మాస్‌ అనేది జనరల్‌ కేటగిరి అభ్యర్థుల మాస్‌లో 90 శాతం వర్తిస్తుంది. 8.ఎస్‌సి, ఎస్‌టి, పిడి క్యాటగిరీ అభ్యర్థుల మాస్‌ అనేది జనరల్‌ అభ్యర్తుల మాస్‌లో 50 శాతం వర్తిస్తుంది. పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ్స్నల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.