నూతన గృహప్రవేశం

AP CM New House in Jubiliee Hills
AP CM Chandra babu Naidu’s New Housse, Jubilee  Hills

నూతన గృహప్రవేశం

హైదరబాద్‌:ఎపి సిఎం చంద్రబాబునాయుడు నూతన గృహప్రవేశం చేశారు.. ఆదివారం రాత్రి ఇక్కడ నూతన గృహంలోకి ప్రవేశించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలో గతంలో చంద్రబాబు ఉన్న ఇంటిని నేలమట్ట చేసి ఆస్థానంలో నూతన గృహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.. ఉదయం 11 గటంగల ప్రాంతంలో కొత్త ఇంట్లో హోమాన్ని నిర్వహించారు.. సోమవారం ఉదయం సత్యనారాయణస్వామి వత్రాన్ని జరపనున్నారు.