నీరవ్‌మోడి ఆస్తులను రూ.637కోట్లను జప్తు చేసిన ఈడీ

NIRAVMOD-1
NIRAVMOD-1

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి కేసులో ఈడీ తాజాగా మరిన్ని చర్యలు తీసుకుంది. నీరవ్‌, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్లు ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది. భారత్‌ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్‌, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లను, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు చప్పింది.