‘నీకు తోడై నీ వెంటే ఉంటాను’

robert vadra, priyanka vadra
robert vadra, priyanka vadra

న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రియాంకగాంధీకి పలువురు నేతలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఐతే ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ,ప్రియాంకాకు అభినందనలు తెలుపుతూ..”నీ జీవితంలోని ప్రతి దశలో ఎల్లప్పుడూ నీకు తోడై నీ వెంటే ఉంటాను, నీకు సాధ్యమైనంత మేర పనిచెయ్యి ”అని ఆయన ఆమెను ప్రోత్సహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఆమె రాకను పార్టీ , యూత్‌ కాంగ్రెస్‌, నేతలు అందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకాన్ని స్వాగతిస్తున్నారని, క్రియాశీలక రాజకీయాల్లోకి ఆమె రాక కార్యకర్తలను ఉత్తేజపరుస్తుంది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.