నియంత్రణ రేఖ వద్ద కట్టుదిట్ట చర్యలు: అరుణ్‌ జైట్లీ

 

Arun Jaitley copy
Arun Jaitley

 

భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేలా పాకిస్థాన్‌ వారిని ప్రేరేపిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
విమర్శించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నకు సమాధానంగా జమ్మూకశ్మీర్‌లోకి
చొరబడుతున్న ఉగ్రవాదులకు భారత రక్షణ దళం ధీటుగా సమాధానం చెబుతోంది. గతేడాదిలో పాక్‌
కాల్పుల విరమణ ఉల్లంఘనలకు 228 మార్లు పాల్పడగా, ఈ ఏడాది నియంత్రణ రేఖ (ఎల్వోసి)
వెంబడి 285 సార్లు పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు.చొరబాట్ల నియంత్రణకు భారత రక్షణ
తగు రీతిలో చర్యలు తీసుకుంటోందన్నారు. రాడార్లు, ప్రత్యేక సెన్సార్ల ద్వారా చొరబాటుదారులను
గుర్తించడం ద్వారా వాటిని భగ్నం చేయగలుగుతున్నామని చెప్పారు. సరిహద్దు భద్రత గురించి
ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు.