నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది

virushka
virushka

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. తిరుగులేని ఆటతో కంగారూలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో అన్ని సిరీస్‌ల్లోనూ అజేయంగా నిలిచింది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లపై క్రికెట్‌ అభిమానులు నుంచి ప్రముఖుల వరకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్‌ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కోహ్లి సేనను పొగడ్తలతో ముంచెత్తారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై లవ్‌ అంటూ భర్తను ట్యాగ్‌ చేస్తూ అనుష్క ట్వీట్‌ చేశారు.