నిజాన్ని చెప్పటం కోసమే ఎన్టీఆర్‌ బయోపిక్‌

RGV
RGV

నిజాన్ని చెప్పటం కోసమే ఎన్టీఆర్‌ బయోపిక్‌

యదార్థ గాథల్ని సినిమాగా తెరకెక్కించటంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో దివంగత మహానటుడు, రాజకీయనాయకుడు ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరకెక్కించేపనిలో ఉన్నారు.. మరోవైపు బాలకృష్ణ కూడ ఎన్టీఆర్‌ జీవిత గాథను రూపొందించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వర్మ ఈసినిమా చేస్తుండటం, అది కూడ లక్ష్మీపార్వతి కోణం నుండి తీస్తుండటం అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది..
రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాల్ని చెప్పటం కోసమే ఈసినిమా చేస్తున్నానని, అదే తన ఆంతరంగిక అభిమతమని, ఈచిత్రాన్ని ప్రధాన ప్రతిపక్ష వైకాపాకు చెందిన నేత పి.రాకేష్‌రెడ్డి నిర్మిస్తున్నారని, ఆయన ఉద్దేశ్యం కూడ పాలిటిక్స్‌ కావని, నిజాల్ని చెప్పడమేనని వర్మ సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.. మరి ఆరంభంలోనే ఇంతటి సంచలనానికి దారి తీసిన ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలకు తావిస్తుందోనని సినీ, రాజకీయవర్గాల్లో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.. ఈ ప్రాజెక్టు ఎపుడు రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తుంది.. నటీనటులు, విడుదల వంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.