నిందితులపై న్యాయవాదుల దాడి

RAPISTS
RAPISTS

ఏడోతరగతి బాలికపై ఏడునెలలుగా అత్యాచారం
మొత్తం 17 మంది నిందితులను అరెస్టుచేసిన చెన్నైపోలీస్‌
నిందితులపై కోర్టు హాలులోనే న్యాయవాదుల దాడి
చెన్నై: మైనర్‌బాలికపై ఆరునెలలుగా అత్యాచారానికి ఒడిగడుతున్న17మంది నిందితులపై చెన్నై సిటీ సివిల్‌కోర్టులో న్యాయవాదులే దాడిచేసి చితకబాదారు. కోర్టు హాలునుంచి 17 మందిని బైతికి తీసుకువస్తున్న తరుణంలోనే న్యాయవాదులు ఒక్కసారిగా వారిపై పడి దాడిచేసారు. విస్తృతమైన పోలీస్‌ బందోబస్తు ఉన్నప్పటికీ నిందితుందరినీ కారిడార్‌లో పడేసి మరీ కొట్టారు. నిందితుల్లో కొందరిని పోలీసులు రక్షించగలిగారు. కోపోద్రిక్తులైన న్యాయవాదులు వారిని కుటుంబ వివాదాల కోర్టుహాలులోనికి, సిబిఐ కోర్టులోనికి లాగి తీవ్రంగా కొట్టారు. వారుచేసిన ఘోరమైన అకృత్యంపై వారంతా తీవ్ర ఆగ్రహావేసాలు వ్యక్తంచేసారు. న్యాయవాదులందరూమొత్తంగా నిందితులు స్వేఛ్ఛగా తిరిగేందుకు వీలులేకుండా చేయాలని పేర్కొన్నారు. అదనపు కమిషనర్‌ హెచ్‌ఎంజయరామ్‌, జాయింట్‌ కమిషనర్‌ టిఎస్‌ ఎస్‌ అంబు తదితర అధికారులు సంఘటన ప్రాంతంలో నిందితులను బందోబస్తుమధ్య బైటికి తెచ్చారు. జరిగిన సంఘటనను బట్టిచూస్తుంటే 17 మంది వ్యక్తులు 12 ఏళ్ల బాలికను చెరబట్టి అదేపనగా అత్యాచారాలు చేస్తున్నారు. పురస్‌వాల్కమ్‌ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న 22 మంది నిందితులు వీరిలో సెక్యూరిటీ గార్డులు, ఎలివేటర్‌ ఆపరేటర్లు, ప్లంబర్లు సైతం నిందితులుగా ఉన్నారు. ఏడునెలలనుంచి వీరు ఆ బాలికకు మత్తుపదార్ధాలిచ్చి ఇంజక్షన్లుచేసి పైశాచిక వాంఛను తీర్చుకుంటున్నారు. అంతేకాకుండా శీతలపానీయాల్లో మత్తుపౌడర్‌ వంటి వాటిని కలిపి ఆమెకు తాగించి ఆపై లైంగింక అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అంతేకాకుండా అత్యాచారంచేస్తున్న ఘనకార్యాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించసాగారు. బాలిక సోదరి ఒకరోజు గమనించి ఆమె తల్లికి చేరవేయడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. కూపీలాగితే మొత్తం ఏడునెలలుగా ఆ అమాయకురాలిని ఘోరంగా తమపశువాంఛకు బలిచేస్తున్నట్లు పోలీస్‌ దర్యాప్తులో తేలింది. ఇప్పటికిప్పుడు 17మందిని అరెస్టుచేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరుపరిచి తిరిగి తీసుకువెళుతుండగా న్యాయవాదులే వారినిచూసి కోపోద్రిక్తులయ్యారు. అమాయకురాలిపై ఘోరానికి పాల్పడ్డారని వారంతా నిందితులపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. సమాజంలో ఇటువంటి వారు స్వేఛ్చగా తిరిగేందుకు అనుమతించకూడదని వారు ఆగ్రహం వ్యక్తంచేసారు. సుమారు 50 మందికిపైగా న్యాయవాదులు నిందితులను కిందికి తోసివేసి వారిని కొట్టారు. వీరిలో ఎనిమిది మంది నిందితులు అదనపు మూడో కుటుంబ కలహాలవిచారణ కోర్టులో ఉన్నారు. మిగిలిన తొమ్మిది మందిని మహిళాకోర్టుకు పంపించారు. ఫ్యామిలీ కోర్టు న్యామూర్తి ధర్మన్‌,మద్రాసు కోర్టు న్యాయవాదులసంఘం అధ్యక్ష˜ఉడు మోహన్‌ కృష్ణన్‌, న్యాయవాది కన్నదాసన్‌, పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ అంబు, అదనపు కమిషనర్‌ జయరాంలుకలిసి న్యాయవాదులతో సంప్రదించి నిందితుల విడుదలకు మార్గం సులువుచేసారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదులసంఘం నిందితుల్లో ఏ ఒక్కరితరపున వాదించకూడదని నిర్ణయించిందని సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. న్యాయసహాయం అందించినా న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు.