నిండైన లుక్ తో మెరిసిపోయింది

KAJOL
KAJOL

బాలీవుడ్ భామ కాజోల్ ..తాజాగా ముంబైలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం అటెండ్ అయిన కాజోల్.. అక్కడి ఫోనిక్స్ సిటీ మాల్ కి వెళ్లింది. వైట్ గౌను.. పోనీ టైల్.. నిండైన లుక్ తో బాగానే మెరిసిపోయింది. అయితే.. అక్కడ జనాలు ఫుల్లుగా ఈమెను చుట్టుముట్టేయడంతో.. బాడీ గార్డులు జాగ్రత్తగా ఈమెను అక్కడి నుంచి ఎస్కలేటర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎస్కలేటర్ పై నుంచి దాటే సమయంలో హీల్స్ జారడంతో.. దభేల్ మని పడిపోబోయింది ఈ సీనియర్ బ్యూటీ.

కానీ సెక్యూరిటీ గార్డ్ పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో దిల్ వాలే మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ఇలాగే కాలు జారితే.. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుణ్ ధావన్ ఆమెను పట్టుకుని ఆపాడు. ఇప్పుడు ఇలా జరిగింది. కెరీర్ లో ఇంత ఎదిగింది కానీ.. పడకుండా నడవడం మాత్రం ఇంకా ఈ బ్యూటీ నేర్చుకోలేదనుకుంటా!