‘నా బిడ్డ బతికి బైటపడటం నా అదృష్టమే’

VIJAYAMMA
VIJAYAMMA

హైదరాబాద్‌: జగన్‌పై దాడి తర్వాత విజయమ్మ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జగన్‌ కోలుకొవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుంది. కోట్ల మంది ప్రజల ఆశీస్సులే తన బిడ్డను కాపాడాయని ఆమె అన్నారు. జగన్‌ కోలుకుంటున్నారు. రేపటి నుంచి తిరిగి ప్రజా సంకల్ప యాత్ర మొదలవుతుంది. వైఎస్‌ చనిపోయిన దగ్గర నుంచి మా కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. జగన్‌తో పాటు తన తల్లి, తన చెల్లి , తన భార్యపై కూడా ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ ఆ పార్టీ మాత్రం టిడిపితో కలిసి మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. సిబిఐ, ఐటి, ఈడి దాడుల పేరుతో ఆర్ధికంగా అణగదొక్కాలని చూస్తున్నారు. నా బిడ్డను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టించారు.