నాలుగుతరాల్లో ఏం చేశారు?

modi
modi

అభివృద్ధికి నోచుకోని ఛత్తీస్‌గఢ్‌
కేంద్రంలో పదేళ్లపాటు రిమోట్‌ కంట్రోల్‌ పాలన
ఎన్నికల ర్యాలీలో ప్రధానినరేంద్రమోడీ
మహాసముంద్‌(ఛత్తీస్‌ఘర్‌): నాలుగుతరాలనేతలు పాలించినా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, పరిస్థితిలో మార్పులేదని, కాంగ్రెస్‌ కుటుంబ వారసులు చివరకు సీతారామ్‌కేసరిని ఎఐసిసి అధ్యక్షునిగా పదవీకాలం కూడా పూర్తిచేయనీయలేదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడుగా సమర్ధుడైన వ్యక్తిని ఎంచుకోగలరా అని ఆయన సవాల్‌చేసారు. పార్టీ అద్యక్షుడు ఒక కుటుంబానికి చెందనివాడిని అద్యక్షునిగా నియమించగలరా అని ప్రశ్నించారు. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని పోలుస్తూ ప్రధాన ఇనరేంద్రమోడీ ఆదివారం పార్టీపై తీవ్ర విమర్శలుచేసారు. ఆనాటి ఎఐసిసి అధ్యక్షుడు సీతారామ్‌కేశ్రిని ఆయన పదవీకాలం కూడా పూర్తిచేయనీయలేదని, ఆఫీసు బైటకు గెంటివేసారని, కొత్త పార్టీ అద్యక్షురాలిగా సోనియాగాంధీని చేసేందుకే కేసరిని సాగనంపారని ఆయన ఎద్దేవాచేసారు. రెండోవిడత ఎన్నికలకు సంబందించిఛత్తీస్‌ఘర్‌లోచివరిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ర్యాలీలోమాట్లాడారు. ఒక కుటుంబానికి చెందిన నాలుగు తరాలు దేశాన్ని పాలించాయని వారికి మాత్రం అధికారపరంగా మేలుజరిగిందని, కానీ వారి పాలననుంచి దేశప్రజలకు ప్రయోజనం కలగలేదని ధ్వజమెత్తారు ఒక దళితుడైన సీతారామ్‌కేసరిని ఎఐసిసి అద్యక్షుడిగా నియమించి చివరకు ఆయన్ను కొనసాగనీయలేదని అన్నారు. సోనియాగాంధీకి అధ్యక్షపదవికోసం కేసరిని ఫుట్‌పాత్‌పైకి తోసివేసారని మోడీ విమర్శించారు. అంతకుముందు ఢిల్లీలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం నడిచేదని, ఈ రిమోట్‌ ఒక కుటుంబం చేతిలో ఉండేదని, ఇపుడు ఆకుటుంబానికి బిజెపి అంటే భయం పట్టుకుందని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబాన్నే లక్ష్యంగాచేసుకుని మోడీ విమర్శలుచేసారు. అయితే వాస్తవానికి సీతారామ్‌కేసరి దళితుడు కాదు వెనుకబడిన తరగతులనేత అని కాంగ్రెస్‌పార్టీ పీఎం మోడీకి అవగాహణ లేదని విమర్శించింది. నెహ్రూగాంధీ కుటుంబంనుంచి కాకుండా బయటినుంచి ఒక సమర్ధుడైన నాయకుణ్ణి కాంగ్రెస్‌ పార్టీ నియమించగలదా అని సవాల్‌చేసారు. నాలుగతరాలు పాలించినా కుటుంబసంక్షేమంకోసమే పనిచేసారని, దేశ ప్రజల దురదృష్టకరపరిస్థితులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజలసంక్షేమంపై ఏనాడూ యోచించిన పాపానలేదని అన్నారు. ప్రజల ఆశలను వారు ఎలా నెరవేరుస్తారని ఇపుడు విశ్వసిస్తామని ఆయన అన్నారు. ఛత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కూడా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంనుంచి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారన్నారు. పదేళ్ళపాటు కేంద్రం రిమోట్‌కంట్రోల్‌ప్రభుత్వం కొనసాగిందని ఛత్తీస్‌ఘర్‌వైపు ఎలాంటి దృష్టి,శ్రద్ధ చూపించలేదని మోడీ విమర్శించారు.