ద‌క్షిణాఫ్రికా టెస్టు స్కోరు

rabada, amla
rabada, amla

జొహ‌న్న‌స్‌బ‌ర్గ్ః దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత పేసర్ భువనేశ్వర్ మరోసారి చెలరేగిపోయాడు. తొలి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ ఓపెనర్ మార్క్‌రం(2)ను పెవిలియన్ బాట పట్టించిన భువీ. రెండో రోజు ఆరంభంలోనే మరో ఓపెనర్ ఎల్గర్‌(4) వికెట్ తీశాడు. భువనేశ్వర్ వేసిన 13వ ఓవర్ మూడో బంతికి ఎల్గర్ కీపర్ పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 26 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసి భారత్‌ కంటే 133 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో రబాడా(20), ఆమ్లా(18) ఉన్నారు.