దేశంలో అల్లర్లు, పేలుళ్లకు మూలాలు హైదరాబాద్‌లోనే..

G. Kishan reddy
G. Kishan reddy

హైదరాబాద్‌: నిన్న నాంపల్లి కోర్టులో మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు కాంగ్రెస్‌కు మింగుడు పడని విషయమని బిజెపి ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ ఆ హిందూ తీవ్రవాదం అంటూ ముద్ర వేయాలని కాంగ్రెస్‌ చూస్తుందని విమర్శించారు. కోర్టు తీర్పును ప్రధాని మోదీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాదన, సాక్షాల ఆధారంగా తీర్పు వస్తుందని కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మతకలహాలకు కాంగ్రెస్సే కారణమని ఆయన అన్నారు. దేశంలో అల్లర్లు, పేలుళ్లకు మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు.