దీపావళికి రోబో-2 : రజినీకాంత్‌

Rajani kanth
Rajani kanth

దీపావళికి రోబో-2 : రజినీకాంత్‌

చెన్నై:: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మలేసియా ప్రధాని నబీద్‌ రజాక్‌తో సమావేశమయ్యారు.. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. మలేసియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా తాను వ్యవహరించనున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు..మలేసియా ప్రభుత్వ పెద్దలు చెన్నైకి వస్తేనే కలిశారని తెలిపారు. ఆదివారం జరగనున్న అభిమాన సంఘం సమావేశంలో తాను పాల్గొనటం లేదని అన్నారు. మలేసియా ప్రధానితో సమావేశం రాజకీయ అరంగేట్రం కోసం ఏర్పాటు చేసింది కాదని స్పష్టం చేశారు.. ఈ మధ్య కాలంలో తానెపుడూ ఫ్యాన్స్‌ను కలిసింది లేదని, ఏప్రిల్‌ 11వ తేదీన నుంచి 16 వరకు ఫ్యాన్స్‌కు కలవనున్నట్టు తెలిపారు.. జాఫ్నాకు వెళ్లపకవపోటం అసంతృప్తగా ఉందన్నారు.. రోబో 2 షూటింగ్‌ పూర్తయిందని, ఈ ఏడాది దీపావళికి సినిమా రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.