దసరా వేడుకలో విషాదం

incident
incident

దసరా వేడుకలో విషాదం

పంజాబ్‌లో రావణదహనం చూస్తున్న ప్రజలపైనుంచి దూసుకెళ్లిన రైలు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని జోధా పాథక్‌ ప్రాంతంలో దసరా ఉత్సవాల సందర్భంగా రావణదహనం కార్యక్రమాన్ని తిలకిస్తున్న సందర్శకులపైనుంచి రైలు దూసుకు పోవడంతో సుమారు 60 మంది చనిపోయారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి ఏడు గంటలప్రాంతంలో జోధాపాథక్‌వద్ద ప్రజలు రావణ దగ్ధం వీక్షిస్తుండగా ఈ ప్రమాదంజరిగింది. అసలు కారణం రైల్వేట్రాక్‌పై రావణ దహన కార్యక్రమం నిర్వహించడమే నని తేలింది.

IMG--
IMG–

అదేసమయంలో రైలు అటుగా రావడంతో పెనుప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచుని వీక్షిస్తున్నవారిపైకి రైలుదూసుకుపోవడంతో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతులసంఖ్య మరింతపెరిగే అవకాశం ఉంది. ఈ రైలు పఠాన్‌కోట్‌నుంచి అమృత్‌సర్‌ వెళుతోంది. ప్రమాదం జరిగే సమయంలో రైల్వేట్రాక్‌పై 500 నుంచి 700 మందికిపైగా ప్రజలు రావణదహనాన్ని వీక్షిస్తున్నట్లు తేలింది. బాణాసంచా కాలుస్తూ సంబరాలుచేసుకుంటున్న సమయంలోనే రైలు ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. గాయపడిన బాధితులను దగ్గరల్లోని ఆసుపత్రులకు తరలించారు.