త్వరలో పెళ్లి కబురు చెప్పనున్న సుస్మితా?

SUSMITA SEN, ROHMANN
SUSMITA SEN, ROHMANN

ముంబై: మాజీ విశ్వసుందరి , బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. కొంతకాలంగా రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో సుస్మిత ఉన్నట్లు తనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. కొన్ని వారాల క్రితమే పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్‌ సుస్మితకు ప్రపోజ్‌ చేయడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తుంది. 2019లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. సుస్మిత ఇప్పటికే ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారు.