త్వరలోనే టెన్నిస్‌కు గుడ్‌బై!

andy murray
andy murray

మెల్‌బోర్న్‌: బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ నెంబర్‌వన్‌ ఆండీముర్రే మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తన కెరీర్‌ మధ్యలోనే ముగిసిపోతున్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం మెల్‌బోర్న్‌ వచ్చిన ఆండీ మీడియాతో మాట్లాడుతూ..హిప్‌ సర్జరీ తర్వాత తన సత్తా తగ్గిందని, ఆ నొప్పికి ఎక్కువగా ఆడలేకపోతున్నానని అతను తెలిపాడు. ఈ నొప్పితో నాలుగైదు నాలుగైదు నెలలు ఆడడం కూడా కష్టమేనని అన్నారు. త్వరలోనే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు అతను వెల్లడించాడు.